
టాలీవుడ్ స్టార్ హీరోలని అభిమానులు వారి బిరుదులతో పలకరిస్తూ మురిసిపోతుంటారు. చిరంజీవికి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఏదో ఒక బిరుదు ఉండనే ఉంది. చాలామంది హీరోలకు ప్రారంభంలో ఉన్న బిరుదులు మారిపోయాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చిరంజీవికి హీరోగా క్రేజ్ వచ్చాక సూపర్ హీరో అనే బిరుదు ఇచ్చారు. చాలా కాలం పాటు అభిమానులు చిరంజీవిని సుప్రీం హీరో అని పిలుస్తూ మురిసిపోయేవారు. ఆ తర్వాత మరణ మృదంగం చిత్రం నుంచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా చిరు మారారు. మెగాస్టార్ బిరుదు వచ్చిన తర్వాత చిరంజీవి క్రేజ్ ఇంకా రెట్టింపు అయింది. టాలీవుడ్ లో చిరు ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. నందమూరి బాలకృష్ణని అభిమానులు ముగ్గుగా యువరత్న అని పిలుస్తారు. ఆ తర్వాత యువరత్న నుంచి ఆయన బిరుదు నటసింహంగా మారింది. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటున్నారు. అక్కినేని నాగార్జునకి ప్రారంభంలో యువ సామ్రాట్ అనే బిరుదు ఇచ్చారు. చాలా కాలం అదే బిరుదు కొనసాగించారు. కింగ్ మూవీ విజయం తర్వాత యువసామ్రాట్ నాగార్జున.. కింగ్ నాగార్జునగా మారారు. కింగ్ అనే బిరుదు నాగ్ కి అంతగా కలసి రాలేదు అనే చెప్పాలి. ఆ తర్వాత నాగ్ కెరీర్ లో ఎక్కువగా విజయాలు దక్కలేదు. మహేష్ బాబు టాలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు. ప్రారంభంలో మహేష్ బాబుకి ప్రిన్స్ అనే టైటిల్ ఇచ్చారు. పోకిరి చిత్రం తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనితో ప్రిన్స్ ప్లేస్ లో సూపర్ స్టార్ టైటిల్ వచ్చింది. సూపర్ స్టార్ టైటిల్ మహేష్ కి బాగానే కలసి వచ్చింది. సినిమా సినిమాకి మహేష్ రేంజ్ పెరుగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఒక సునామీలా టాలీవుడ్ లోకి