
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ముప్పైఏళ్లుగా తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆ తర్వాత తరం హీరోలు ఎంత మంది వచ్చినా, ఆయన స్థానాన్ని ఎవరూ తాకలేకపోయారని చెప్పొచ్చు. చిరంజీవి ఇప్పటికీ తన సీనియర్ హీరోల్లో తానే టాప్ అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల `మన శంకర వర ప్రసాద్ గారు` చిత్రంతో మరోసారి తన సత్తాని చాటారు. ఈ చిత్రం రీజినల్ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. చిరంజీవి రేంజ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటి వరకు 158 సినిమాలు చేశారు. మధ్యలో మరెన్నో చిత్రాలు ఆగిపోయాయి. సింగీతం శ్రీనివాస్‌రావుతో ఓ మూవీ అనుకొని ఆపేశారు. అలానే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతోనూ ఓ మూవీ షూటింగ్ చేసి ఆపేశారు. అయితే చిరంజీవితో సినిమా చేయకపోవడంతో ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అసలు కారణం వెల్లడించాడు. మెగాస్టార్‌తో మూవీ చేసే సత్తా తనకు లేదని వెల్లడించాడు. ఆయన ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయలేనని తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఆయన అభిమానుల అంచనాలకు తగినట్టుగా సినిమా తీసే కెపాసిటీ తన వద్ద లేదని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. తన మార్క్ సెన్సిబులిటీస్ వేరుగా ఉండటం వల్ల, మెగాస్టార్ స్థాయి మాస్ సినిమాను మలచడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. ఆయన రేంజ్ మూవీ చేయడం తన వల్ల కాదని బహిరంగంగానే ఒప్పుకున్నాడు వర్మ. ఆయనతో సినిమా ఆగిపోవడానికి కారణం కూడా అదే అని ఆయన వెల్లడించారు. 1996 టైమ్‌లో రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నాడు. ఆ సమయంలో చిరంజీవితో ఆగస్ట్ 11న సినిమాని ప్రారంభించారు.ఇందులో ఊర్మిళను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మణిశర్మ సంగీత దర్శకుడిగా ఖరారు అయ్యారు. కర్నాటకలో తొలి షెడ్యూల్‌ని షూట్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. కొన్ని సన్నివేశాలు, ఒక పాటని