చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు
Actor ProfileActor

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు
Chitrajyothy15 Aug 2026
చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇప్పుడంటే మెగాస్టార్ గురించి అందరికీ తెలుసు.. ఆయన నటన గురించి అందరికీ తెలుసు. కానీ,ఆయన తొలిరోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు అనేది మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. అలాంటివారిలో మురళీ మోహన్ ఒకరు. తాజాగా ఒక వేదికపై చిరంజీవి తొలి రోజుల గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) పంచుకున్నారు. ఆయన ఎప్పటికైనా ఇండస్ట్రీకి మొగుడు అవుతారు అని అప్పుడే గుర్తించినట్లు మురళీ మోహన్ తెలిపారు. చిరంజీవిని అందరూ అన్నయ్య అంటారు.. ఆయన మిమ్మల్ని అన్నయ్య గారు అంటారు.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్నకు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ' చిరంజీవి మొదటి సినిమా మనవూరి పాండవులు చేస్తున్నప్పుడు మిగిలినవారు నన్ను అన్నయ్య అని పిలిచేవారు. అందులో నాది ధర్మరాజు క్యారెక్టర్ కాబట్టి.. అన్నయ్య.. అన్నయ్య అని పిలిచేవారు. ఎక్కడికి వెళ్ళినా మేము ఐదుగురం వెళ్ళేవాళ్ళం తరువాత ఒకరోజు కృష్ణంరాజు అన్నారు. ఈ అబ్బాయి చాలా మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు.. పెద్ద యాక్టర్ అవుతాడయ్యా అని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. కళ్లలోని తీక్షణతను చూసి భవిష్యత్తులో ఇండస్ట్రీకి మంచి విలన్ అవుతాడు అని అంటే.. నేను చిరంజీవి విలన్ ఏంటి అండి... అతనికి ఉన్న టాలెంట్ ని చూస్తే నాకే మతిపోతుంది. ఇండస్ట్రీకే మొగుడు అవుతాడు అన్నాను. నిజంగా అన్నట్టే అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళ్టికి నన్ను అన్నయ్య అనే పిలుస్తాడు. పద్మశ్రీ వచ్చింది అని తెలిసిన నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చి గంట కూర్చొని నన్ను