
Telugu Times•9 Aug 2026
చీర క ట్టులో మ రింత అందంగా అన సూయప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె జబర్దస్త్(Jabardasth) కామెడీ షోలో యాంకర్ గా మారి దాన్నుంచి తన యాక్టింగ్ జర్నీని ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటూ నిర్విరామంగా ఈ షోలో కొనసాగిన అనసూయ.. అనూహ్యంగా షో నుంచి తప్పుకుని సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే అనసూయ తాజాగా బ్లూ కలర్ పట్టు చీర, దానికి మల్టీకలర్ బ్లౌజ్ ను ధరించి సింపుల్ హెయిర్ స్టైల్ తో తన అందాన్ని ఎలివేట్ అయ్యేలా చేయగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి