
తమ మధుర గళాలతో మత్తు చల్లిన ఇద్దరు గాయనీమణులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు... అవి 'పాటల మూటలు' అయితే బాగుంటుందని సినీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... కానీ వారిద్దరి గొడవను పెంచాలని సోషల్ మీడియా యోచిస్తోంది. 'మై బాడీ... మై రైట్' అంటూ కొందరు డేర్ డెవిల్స్ సాగుతూ ఉంటారు... అది మగాళ్ళయినా, ఆడవారైనా 'ఆ రైట్'కూ కొన్ని హద్దులు ఉంటాయి... ఇతరులకు ఇబ్బంది కలిగించనంతవరకూ మన ఇష్టాలు ఎలా సాగినా పరవాలేదు- అవి శ్రుతి మించితేనే ప్రమాదం అంటారు పెద్దలు... వారితో సింగర్ సునీత కూడా ఏకీభవిస్తున్నారు... ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో - మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదని, దానిని స్వేచ్ఛగా భావించలేమని సునీత అభిప్రాయపడ్డారు... ఈ వ్యాఖ్యలపై మరో ఫిమేల్ సింగర్ చిన్మయి శ్రీపాద అభ్యంతరం వ్యక్తం చేశారు... గాయనిగా సునీత పట్ల తనకు గౌరవముందని, ఆమె అలా మాట్లాడటం వల్ల మహిళలకు మరింత నష్టం జరుగుతోందని చిన్మయి స్పందించారు... దాంతో సునీత వర్సెస్ చిన్మయి అంటూ సోషల్ మీడియాలో కథలు గింగుర్లు తిరుగుతున్నాయి... తన కామెంట్స్ పై చిన్మయి ఇచ్చిన కౌంటర్ కు సునీత ప్రతిస్పందించారు... తనకూ సింగర్ గా చిన్మయి అంటే ఎంతో గౌరవం ఉందని, అయితే తన మాటలు మహిళలకు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని చిన్మయి అనడం సబబు కాదన్నారు సునీత... 'మై బాడీ మై విష్' అన్నప్పుడు 'హిజ్ ఐస్... హిజ్ విష్' అని తాను అన్నానని సునీత అంగీకరించారు... ప్రస్తుతం మనమున్న సొసైటీ పెద్దగా ఎదగలేదని, అందువల్లే తాను ఆ కామెంట్స్ చేశానని సునీత తెలిపారు... అంతేకానీ, 'మై హ్యాండ్... మై విష్...' అంటూ ఎవరైనా అంటే వారి చేతులు నరికే వారిలో ముందుగా తానుంటానని సునీత చెప్పారు... అదే సమయంలో మహిళల గౌరవం కోసం చిన్మయి చేసిన పోరాటాలనూ సునీత అభినందించడం విశేషం