
హీరోలు, హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అందాల తార. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా 19 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకుని కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఒంటరిగా జీవిస్తూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ఒకప్పటి హీరోయిన్ రుఖ్సర్ రెహ్మాన్. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రఖేగీ దునియాలో కథానాయికగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది రిషి కపూర్ సరసన ఇంతేహా ప్యార్ చిత్రంలో మెరిసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. 17 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ అయ్యింది. కానీ కుటుంబం ఆదేశాల మేరకు నటన మానేసి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే ఆమెకు బాజీగర్, రోజా వంటి భారీ సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలనుకున్న కుటుంబం సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. కానీ పెళ్లి తర్వాత రుఖ్సార్ కు పాప జన్మించింది. 19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని తన 8 నెలల కూతురితో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రుఖ్సర్. ఆ తర్వాత నటనవైపు కాకుండా సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించింది. ఆతర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ అందాల తార. దాదాపు దశాబ్దం తర్వాత ఆమె రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఢీ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. 2005లో వచ్చిన సర్కార్ , గాడ్ తుస్సీ