
Eenadu•14 Jun 2026
చినుకుపడితే వణుకే.. విజయవాడలో వరద నీటితో ప్రజల ఇక్కట్లుచినుకుపడితే చాలు పట్టణాలు, నగరాల్లో వణుకే. కొద్దిపాటి వర్షాలకే ముంపునీరు ముంచెత్తుతోంది. ప్రధానంగా విజయవాడలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై లోతట్టు ప్రాంత కాలనీల్లో రోజులకొద్దీ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముంపు భయం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. కాలువల ఆక్రమణలు, పేరుకుపోతున్న పూడికలు సమస్యగా మారాయి. ప్రతి వేసవిలోనూ ఉదాసీనంగా ఉండే అధికారులు, వర్షాలు ప్రారంభంకావడంతో హైరానా చెందడం రివాజుగా మారింది. ముందుచూపు, ప్రణాళిక లేకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వార్త చదివారా: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ఆరా తీసిన హోం మంత్రి