
ఇంటర్నెట్ డెస్క్: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal)తో కలిసి పనిచేయబోతున్నారన్న వార్తలు ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చాయి. దర్శకుడి తండ్రే స్వయంగా ఈ విషయాన్ని పంచుకోవడంతో, అందరూ అది ఖరారైనట్లేనని భావించారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిదంబరం దీనిపై స్పష్టతనిచ్చారు. మోహన్‌లాల్‌తో ఏ ప్రాజెక్ట్‌పై చర్చించలేదని వెల్లడించారు. తన తండ్రి ఏదో వదంతి విని దానిని సోషల్ మీడియాలో పంచుకుని ఉండొచ్చన్నారు. సాధారణ సందర్భాల్లో మోహన్‌లాల్‌ను కలిసినప్పటికీ.. ప్రాజెక్ట్ గురించి మాత్రం చర్చ జరగలేదని చిదంబరం తెలిపారు. మోహన్‌లాల్‌తో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని విలేకరి అడిగినప్పుడు, ‘‘ఒకవేళ అవకాశం వస్తే.. ఆ సినిమా ప్రేక్షకులు ఆశించే అద్భుతమైన సన్నివేశాలతో కూడిన వినోదాత్మక చిత్రంగా ఉంటుంది’’ అని ఆయన బదులిచ్చారు. ఇక చిదంబరం ‘బాలన్’ (Balan) అనే తదుపరి చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మోహన్‌లాల్ చివరిగా ‘దృశ్యం 3’ (Drishyam 3)లో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు