చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Actor ProfileActor

చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
TV9 Telugu2 Sept 2026
చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో విపరతీమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా తన కొత్త సినిమా కోసం తన బాడీ మేకోవర్ పూర్తిగా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ హీరో మరెవరో కాదండి.. న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాని.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తన ప్రతిభతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం నాని లుక్ పూర్తిగా మార్చేశారు. ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్.. ఇదిలా ఉంటే.. తాజాగా నాని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరలవుతున్నాయి. అందులో నాని లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్.. గుబురు గడ్డం, స్టన్నింగ్ బాడీ లుక్ తో కనిపించారు నాని. అలాగే ఆ ఫోటోలలో నాని ఎడమచేతి మోచేతికి పెద్ద బ్యాండేజ్ కట్టి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోస్ షేర్ చేస్తూ.. “ఘాయల్ హూ.. ఇస్లీయే ఘాతక్ హూ” (గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను) అంటూ ఒక పవర్‌ఫుల్ దురందర్ సినిమా డైలాగ్‌ను క్యాప్షన్‌గా జోడించారు. జూలై నెలను ఇలాంటి ఒక క్రేజీ అప్‌డేట్‌తో ప్రారంభించిన నాని, త్వరలోనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది