చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు
Actor ProfileActor

చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే
Chitrajyothy23 Jun 2026
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని

చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు
Chitrajyothy22 Jun 2026
చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు

నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది. పిల్లలకు ఎప్పుడూ తండ్రే మొదటి హీరో. నాన్నే తమ ప్రపంచం అనుకునే అందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే. నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది. పిల్లలకు ఎప్పుడూ తండ్రే మొదటి హీరో. నాన్నే తమ ప్రపంచం అనుకునే అందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా కొందరు స్టార్లకు తమ హీరో (తండ్రి)తో ఉన్న అనుబంధానికి అక్షర రూపం... నాన్నే సపోర్టర్‌... నాన్న పేరు గోవర్ధన్‌ రావు దేవరకొండ. ఆయన... విజయ్‌ (దేవరకొండ) యాక్టర్‌ అవుతాడని, నేను క్రీడాకారుడిని అవుతాననుకునేవారు. ఎందుకంటే నేను ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాట్‌ బాల్‌ పట్టుకొని తిరుగుతుండేవాడిని. నా కోసం గంటలకొద్దీ బౌలర్‌ అవతారం ఎత్తేవాడు నాన్న. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి ఇండియా వచ్చినప్పుడు కూడా నాన్నే నా బిగ్‌ సపోర్టర్‌. సినిమాల్లోకి వెళతానన్నప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. ఆయన దగ్గర నుంచి ఓర్పు, సహనం... ఏ పని చేసినా దాని నుంచి ఏమీ ఆశించకూడదని నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారు. ఒకసారి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో నడుస్తుండగా నన్ను, విజయ్‌ని హగ్‌ చేసుకొని ‘నన్ను మీరు ఎక్కడో నిల బెట్టారు. చాలా గర్వంగా ఉంది’ అన్నారు. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. - ఆనంద్‌ దేవరకొండ చాలా కేరింగ్‌ పర్సన్‌... ఎవరేమనుకున్నా నన్ను నాలా ఉండమంటారు మా నాన్న రాజన్‌. చుట్టాలంతా ఆడపిల్లలకు ఇంటి పనులు నేర్పించండి... త్వరగా పెళ్లి చేసి పంపించాలంటూ పోరు పెడుతుంటారు. నాన్న ఆ మాటలేవీ పట్టించుకోరు. మీరు మీ కాళ్ల మీద నిలబడండి చాలు అంటుంటారు. ఆయన ఒక చిరుద్యోగి. అయినా ఉన్నదాంట్లోనే మాకు ఏ కష్టం రాకుండా, ముఖంపై చిరునవ్వు చెరగకుండా జాగ్రత్తగా, చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. నిజ జీవితంలోనూ కింగ్‌ నా ధైర్యం