చంచల్ గూడ జైలులో ప్రభాస్.. స్పిరిట్’ సరికొత్త అప్ డేట్ తో ఫ్యాన్స్ కు పూనకాలే
Actor ProfileActor

చంచల్ గూడ జైలులో ప్రభాస్.. స్పిరిట్’ సరికొత్త అప్ డేట్ తో ఫ్యాన్స్ కు పూనకాలే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చంచల్ గూడ జైలులో ప్రభాస్.. స్పిరిట్’ సరికొత్త అప్ డేట్ తో ఫ్యాన్స్ కు పూనకాలే
NTV Telugu24 Jun 2026
చంచల్ గూడ జైలులో ప్రభాస్.. స్పిరిట్’ సరికొత్త అప్ డేట్ తో ఫ్యాన్స్ కు పూనకాలే

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ ఫోటో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల నీడలు కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Spirit హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో షూట్ చేశారు. నేరస్థుల వేటలో ఉండే ఒక ఇంటెన్స్ జైలు సీక్వెన్స్‌తో ఈ షూటింగ్ షెడ్యూల్‌ను చంచల్‌గూడలో చిత్ర యూనిట్ సక్సెస్‌పుల్‌గా ముగించిందని టాక్. సందీప్ రెడ్డి వంగా మార్క్ వైలెన్స్, ప్రభాస్ స్టార్ పవర్ కలగలిసి ఈ సీన్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నో అంచనాలు ఉన్న ‘స్పిరిట్’ చిత్రాన్ని మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు