
▪️ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో వివాదంతో సతమతం అయ్యాం ▪️ ఇప్పుడు సినిమా విజయంతో సంతోషంగా ఉన్నాం ▪️ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: డైరెక్టర్ సంజీవ్ మేగోటి ▪️ ప్రేక్షకుల ఆదరణతో రెండో రోజు నుంచే పెరిగిన థియేటర్లు ▪️ పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా దూసుకుపోతున్న ‘పోలీస్ కంప్లైంట్’ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదని చిత్రయూనిట్ ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించారు. ఈ వివాదాన్ని పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కరించుకున్నామని చెప్పాను. దీంతో దర్శకుడు సంజీవ్ మేగోటి గారు తన తప్పు లేకపోయినా వరలక్ష్మికి సారీ చెప్పారు. ఆయన ప్రదర్శించిన వినయం, సహనమే ఈ విజయానికి మరో కారణమని పేర్కొన్నారు. సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు సాగడం ఇండస్ట్రీకి కూడా శుభపరిణామమని అన్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “మా చిత్ర హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ లక్ష రేట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్రసన్న కుమార్ వంటి పెద్దల సూచన మేరకే ఆమెకు సారీ చెప్పడం జరిగింది. అంతేకానీ, సమస్య పూర్తి సర్దుమణిగిందని కూడా చెప్పలేను. మొత్తానికి ఒక వివాదంతో