గవర్నర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానం
Actor ProfilePolitician

గవర్నర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గవర్నర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానం
Telugu Times20 Jul 2026
గవర్నర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల (Shiv Pratap Shukla)తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్‌‌తో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం, రాష్ట్రంలో చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై గవర్నర్‌కు వివరించారు. ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి గవర్నర్‌ ఆహ్వానించారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ (M. Dana Kishore), మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ (Anita Ramachandran), వికలాంగుల సాధికారత శాఖ సంచాలకులు బి. శైలజ తదితరులు పాల్గొన్నారు