
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Iran America Conflict: అత్త మీద కోసం దుత్త మీద తీసినట్టు ఉంది ఇరాన్ పరిస్థితి. గత కొన్ని రోజులుగా ప్రపంచ నౌకా రవాణాలకు కేంద్రమైన హార్మూజ్‌లో అమెరికా, ఇరాన్ దళాల మధ్య కాల్పుల జరిగాయి. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హార్మూజ్ జలసంధిలో అక్రమ టోల్ వసూళ్లకు పాల్పడతూ ఉండటంతో అమెరికా దళాలు ఇరాన్ పై దాడులకు దిగింది. దీంతో అమెరికాను డైరెక్ట్ ఎటాక్ చేయలేని ఇరాన్.. అమెరికా వైమానిక స్థావరాలున్న బహ్రెయిన్, కువైట్ లపై మిస్సైల్స్‌తో దాడులకు తెగపడింది. అమెరికా ఇరాన్ కు సంబంధించిన మిస్సైల్, డ్రోన్ స్టోరేజ్ స్థావరాలపై చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు తెగపడినట్టు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ తన దేశానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది. మరోవైపు బహ్రెయిన్ కూడా ఇరాన్ దాడుల నేపథ్యంలో తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కొంత మంది రక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచిస్తుంది. బహ్రెయిన్, కువైట్ లపై ఇరాన్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని చెప్పుకొచ్చింది. తాము మూడో కన్ను తెరిస్తే ఇరాన్ మసి అవుతుందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ హార్మూజ్‌లో సుంకాల వసూళ్లను అమెరికా సహా ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన శాంతి ఒప్పందంలో కూడ అదే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పదే పదే హార్మూజ్ నుంచి ప్రయాణం


