గడ్డిమందు మెషిన్ తో ఆడుకుని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత
Actor ProfileCelebrity

గడ్డిమందు మెషిన్ తో ఆడుకుని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

Total News1
Movie Updates0
Sources1
గడ్డిమందు మెషిన్ తో ఆడుకుని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత
Namasthe Telangana15 Jun 2026
గడ్డిమందు మెషిన్ తో ఆడుకుని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

Peddapalli | పెద్దపల్లి రూరల్, జూన్ 15: పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో గడ్డిమందు పిచికారీ చేసిన మెషిన్‌తో ఆడుకుని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంటో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసులపల్లికి చెందిన ఓ రైతు ఆదివారం తన వ్యవసాయ భూమిలో గడ్డిమందు పిచికారీ చేశాడు. అనంతరం స్ప్రేయర్ మెషిన్‌ను ఇంటికి తీసుకొచ్చి బయట ఉంచాడు. అయితే ఆ మెషిన్‌తో ముగ్గురు చిన్నారులు అకీరా నందన్ (7), కార్తికేష్ (6), రితిక్ (3) ఆడుకున్నారు. ఆ వెంటనే ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.. స్థానికుల సహకారంతో చిన్నారులను తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం