
అనుబంధ గుర్తింపు లేకున్నా.. ప్రైవేటు కాలేజీల్లో జోరుగా ప్రవేశాలు తనిఖీల నివేదికలు ఇచ్చామంటున్న జిల్లా అధికారులు బోర్డు బృందాలు మళ్లీ తనిఖీ చేయాల్సిందేనంటున్న కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గాలిలో ఊగిసలాడుతోంది. కాలేజీల్లో చేరినా వాటికి గుర్తింపు ఉందా? లేదా? అన్న డోలాయమానంలో పడిపోయారు. అన్ని జిల్లాల్లో ఈ అయోమయం నెలకొన్నా ఇంటర్మీడియెట్ బోర్డు ఏమాత్రం చలించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 3,400 జూనియర్ కాలేజీలున్నాయి. ప్రైవేటు రంగంలో 1400. ప్రభుత్వ రంగంలో ఉన్న 800 కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న వాటిల్లో కేవలం 209కి మాత్రమే బోర్డు గుర్తింపు వచ్చింది. వెయ్యికి పైగా కాలేజీలకు అఫ్లియేషన్ ఎందుకు ఆపారో బోర్డు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ‘చూస్తాం... ఇస్తాం... చేస్తాం...’ అంటూ దాటవేస్తున్నారు. అనుబంధ గుర్తింపును ఏప్రిల్ నాటికే పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పారు. ఇంటర్ షెడ్యూల్ ప్రకారం చూసినా మే నెలాఖరుకే గుర్తింపు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేసి, నివేదికలను బోర్డుకు పంపామని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. ప్రైవేటువే కాదు కొన్ని మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలకు కూడా బోర్డు అనుమతినివ్వలేదు. వాటిని ధ్రువీకరించేదెవరు? ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలేజీలు అవసరమైన ధ్రువపత్రాలన్నీ సమర్పించాయి. అగ్నిమాపకశాఖ, శానిటేషన్, ట్రాఫిక్, భవన పటిష్టత వంటి పత్రాలను బోర్డుకు ఇచ్చాయి. వీటన్నింటినీ అధికారులు స్వయంగా పరిశీలించాలని ఇంటర్ కార్యదర్శి భావిస్తున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయి అధికారులు కాలేజీలతో కుమ్మక్కై వాటిని ధ్రువీకరించారనేది కార్యదర్శి అనుమానం. వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎప్పట్నుంచో అనుమతి ఇవ్వొద్దని చెబుతోంది. పరీక్షలు దగ్గరపడే వరకూ అనుమతులూ ఇవ్వడం లేదు. ఆఖర్లో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అఫ్లియేషన్ ఇస్తున్నట్టు చెబుతున్నాయి. అఫ్లియేషన్ లేకున్నా అడ్మిషన్లు అనుబంధ గుర్తింపు