గుర్తుకొస్తున్నాయి’.. పెళ్లికి ముందు అన్నీ మర్చిపోతే
Actor ProfileActor

గుర్తుకొస్తున్నాయి’.. పెళ్లికి ముందు అన్నీ మర్చిపోతే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గుర్తుకొస్తున్నాయి’.. పెళ్లికి ముందు అన్నీ మర్చిపోతే
Eenadu7 Sept 2026
గుర్తుకొస్తున్నాయి’.. పెళ్లికి ముందు అన్నీ మర్చిపోతే

gurthukostunnayi review || వెబ్‌సిరీస్‌: గుర్తుకొస్తున్నాయి; నటీనటులు: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, ప్రియదర్శని రామ్‌, శివన్నారాయణ, వివా రాఘవ, పవన్‌ సిద్ధు, గోదావరి గోపి, అనిష్‌ కురువిల్ల, మేఘనా సునీల్‌, మధు,రామ్‌చరణ్‌, చక్రి, సిమన్‌ తదితరులు; సంగీతం: సుహాస్; సినిమాటోగ్రఫీ : రేహాన్ షేక్; ఎడిటింగ్‌: శ్రీధర్ సోంపల్లి, వెంకటేష్ చుండూరు; నిర్మాత: శరత్ చంద్ర నాయుడు; దర్శకుడు: వినోద్ గాలి; స్ట్రీమింగ్‌ వేదిక: ఈటీవీ విన్‌ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) స్కూల్‌ ప్రిన్సిపల్‌. రూల్స్‌ అంటే రూల్సే. సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నప్పటి నుంచే రఘునాథ్‌ కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)ని ప్రేమిస్తూ ఉంటాడు. అనేక సవాళ్ల తర్వాత ఎట్టకేలకు రఘునాథ్ ఈ పెళ్లికి ఒప్పుకొంటాడు. పెళ్లి కుదిరిందన్న ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులు బొమ్మ ఆనంద్ (గోదావరి గోపి), గణేశ్‌ (వివా రాఘవ), శ్రీకాంత్ (పవన్ సిద్దు)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకు వెళ్తాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సంతోష్‌ తన గతాన్ని మర్చిపోతాడు. కేవలం కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనలే అతడికి గుర్తుంటాయి. పెళ్లి ముందు ఇలా జరగడంతో సంతోష్‌ కుటుంబం స్నేహితులు ఆందోళనకు గురవుతారు. పెళ్లిలోపు పరిస్థితులు చక్కదిద్దడానికి రంగంలోకి దిగుతారు. మరి సంతోష్‌కు గతం గుర్తు చేయడానికి వాళ్లు ఏం చేశారు? అతడికి గతం గుర్తు లేదన్న విషయం బయటపడకుండా ఉండటానికి పడిన కష్టాలు ఏంటి? వైశాలి కుటుంబానికి ఈ నిజం తెలిసిందా? అన్నది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే! మతిమరుపు కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ చక్కటి వినోదాన్ని పంచాయి. ఈ కాన్సెప్ట్‌కు లాజిక్‌లతో పనిలేదు. కొన్ని సన్నివేశాలు, మొత్తం కథను చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ఆ కథా వస్తువు చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, పాత్రలపై దాని ప్రభావం, వారి నటనే ఇందులో కీలకం. ఈ విషయంలో ‘గుర్తుకొస్తున్నాయి’దర్శకుడు వినోద్‌ మంచి మార్కులు కొట్టేశారు. సిరీస్‌ను ఆద్యంతం