గ్రాడియంటే ఇన్ఫోటైన్ మెంట్ తో చేతులు కలిపిన శ్రావ్య ఫిలిమ్స్
Actor ProfileActor

గ్రాడియంటే ఇన్ఫోటైన్ మెంట్ తో చేతులు కలిపిన శ్రావ్య ఫిలిమ్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రాడియంటే ఇన్ఫోటైన్ మెంట్ తో చేతులు కలిపిన శ్రావ్య ఫిలిమ్స్
Chitrajyothy26 Jul 2026
గ్రాడియంటే ఇన్ఫోటైన్ మెంట్ తో చేతులు కలిపిన శ్రావ్య ఫిలిమ్స్

సునీల్‌ కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్ బ్యాటిల్' మూవీ రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకు గ్రాండియంటే ఇన్ఫోటైన్ మెంట్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. ఉత్తమ చిత్రాల అవార్డు గ్రహీత, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందేందుకు సిద్ధమవుతోంది. జూన్ 19న ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రేక్షకులు, విమర్శకులు, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ, 'సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రాన్ని రూపొందించిన శ్రావ్య ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి కలిగిన సినిమా అని మేం విశ్వసిస్తున్నాం' అని అన్నారు. ఈ భాగస్వామ్యానికి ప్రధాన కారకులైన ప్రముఖ వ్యాపారవేత్త, టీపీఎల్‌ ఛైర్మన్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, 'మంచి సినిమాలకు సరైన వేదిక దొరికితే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలవు. పి. సునీల్ కుమార్ రెడ్డి గారి సృజనాత్మక దృష్టి, గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ మార్కెటింగ్ సామర్థ్యం కలిస్తే ఈ సినిమా మరింత విశాలమైన ప్రేక్షకులకు చేరుతుంది. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని విలువైన, సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. మీడియా కన్సల్టెంట్ సందీప్ జైన్ మాట్లాడుతూ, 'ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ఒక ప్రాంతీయ కథ