
మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే మీరు వెంటనే ఈ పని చేయండి. ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) గ్యాస్ కస్టమర్ల కోసం ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోగా తమ ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ గడువు లోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులందరికీ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది, కాబట్టి డెడ్‌లైన్ లోపే ఈ పని పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రకరకాల కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్, గ్యాస్ రవాణాలో 20 శాతం వాటా ఉండే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించడానికి, సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆధార్-బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను మ్యాండేటరీ చేసింది. మార్చి నెలలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీనిని తప్పనిసరి చేయగా, తాజా ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకోని ప్రతి ఎల్‌పీజీ వినియోగదారుడు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు నాన్-ఉజ్వల కస్టమర్ అయి ఉండి, ఇదివరకే కేవైసీ చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. జూన్ 12న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఎలాంటి బ్రేక్స్ లేకుండా మీ ఎల్‌పీజీ సబ్సిడీ బెనిఫిట్స్ కంటిన్యూ అవ్వాలంటే వెంటనే ఈ-కేవైసీ చేయండి" అని కోరింది. జూన్ 30 లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని, ఇది చాలా సింపుల్, సేఫ్