గేమ్ ఛేంజర్ ’ పోస్ట్ మార్టం.. ఫ్లాప్ నకు అసలు కారణాలు చెప్పిన దిల్ రాజు
Actor ProfileActor

గేమ్ ఛేంజర్ ’ పోస్ట్ మార్టం.. ఫ్లాప్ నకు అసలు కారణాలు చెప్పిన దిల్ రాజు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గేమ్ ఛేంజర్ ’ పోస్ట్ మార్టం.. ఫ్లాప్ నకు అసలు కారణాలు చెప్పిన దిల్ రాజు
Eenadu2 Aug 2026
గేమ్ ఛేంజర్ ’ పోస్ట్ మార్టం.. ఫ్లాప్ నకు అసలు కారణాలు చెప్పిన దిల్ రాజు

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా విజనరీ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). దిల్‌రాజు (Dil Raju) నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. తాజా ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్‌’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. కేవలం నాలుగు పాటలకు రూ.75 కోట్లు ఖర్చు చేయడం సమంజసమా?అది మిస్‌ఫైర్‌ అయిందా? అని అడగ్గా.. దిల్‌రాజు వివరణ ఇచ్చారు. ‘‘దర్శకుడు శంకర్‌ సినిమాల్లో పాటలు చాలా స్పెషల్‌. ‘సినిమా అంతా సాధారణంగా తీసినా.. పాటలు ఒక్కోటి, ఒక్కో విధంగా డిజైన్‌ చేస్తాను’ అని ఆయన చెప్పారు. ఆయన పాటలను ఎలా తీస్తారో మనందరికీ తెలుసు. గత సినిమాల్లోనూ చూశాం. ఇక్కడ జరిగింది ఏంటంటే.. మూవీ కంటెంట్‌ ప్రేక్షకులను మెప్పించనప్పుడు పాటలు ఎంత అద్భుతంగా తీసినా ఉపయోగం లేదు. ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో అదే జరిగింది. ఒకవేళ కంటెంట్‌ సూపర్‌గా ఉండి, ఆడియో సూపర్‌హిట్‌ అయితే, అది సినిమాకు అదనపు బలం. అలా జరగనప్పుడు సినిమాకు నష్టమే. సినిమా షూటింగ్‌ కూడా సుదీర్ఘంగా సాగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన మూవీ కావడంతో కంటెంట్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు. స్టోరీలో కొత్తదనం లేక, ‘ఇది ఎక్కడో చూసినట్లు ఉందే’ అని చాలా మందికి అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. కొవిడ్‌, ఓటీటీ మార్కెట్‌ పెరిగిన తర్వాత రివ్యూల కారణంగా సినిమాలకు నష్టం జరుగుతోందన్నారు. ‘‘సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా.. రివ్యూల కారణంగా ‘ఓటీటీలో చూసేద్దాం లే’ అనుకుంటున్నారు. ప్రేక్షకుల అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల వేదికగా వేగంగా షేర్‌ అవుతున్నాయి. ఇది చిన్న సినిమాలకు నష్టం. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తే, కొంత తగ్గవచ్చేమో. అలాగే సినిమా కలెక్షన్లకు, నిర్మాతలు వేస్తున్న పోస్టర్లలోని లెక్కలకు సంబంధం ఉండటం లేదు. ఒకరిని చూసి