గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్
Actor ProfilePolitician

గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్

Total News1
Movie Updates0
Sources1
గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్
Oneindia Telugu17 Jun 2026
గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మేకప్ పై వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. అమర్నాథ్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై మహిళా కమిషన్ తో పాటు పలు చోట్ల కూటమి పార్టీల కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారు. వీటి ఆధారంగా అమర్నాథ్ ను అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.Talliki Vandanam: తల్లికి వందనం డబ్బులు అప్పుడే-తాజా అప్డేట్..!గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నేతలు.. అమర్నాథ్ వ్యాఖ్యలు ఒక మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!మరోవైపు గుడివాడ అమర్నాథ్ పై కూటమి నేతలు చేస్తున్న ప్రచారం, ఫిర్యాదులపై వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. గుడివాడ అమర్నాథ్ కేవలం మేకప్ గురించి మాట్లాడితే కట్టు, బొట్టూ అంటూ కూటమి నేతలు దుఫ్చ్రచారం చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రిగా ఉన్న అనిత గతంలో జగన్ కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి చేసిన వ్యాఖ్యల వీడియోల్ని బయటపెట్టారు. అటు అమర్నాథ్ సైతం తాను ఎలాంటి కించ పరిచే వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదని, సంస్కారహీన భాషపైనే అని తేల్చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తమ పార్టీ నేతలపైనా, అధినేతపైనా నోరు జారితే మరింత గట్టిగా