గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్
Actor ProfileCelebrity

గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ
Samayam Telugu15 Aug 2026
గాడ్ ఆఫ్ వార్’ వచ్చేస్తున్నాడు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ మైథలాజికల్ మూవీ

యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను పంచుకున్నారు. ''శివుడి కుమారుడు.. పార్వతి దేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో'' అని తారక్ సోషల్ మీడియాలో తారక్ పోస్ట్ పెట్టారు.పురాణాలతో ముడిపడిన ఓ కథతో అత్యంత భారీ స్థాయిలో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్‌ కార్తికేయుడు/కుమార స్వామి/సుబ్రహ్మణేశ్వర స్వామిగా కనిపించనున్నారు. ''ఉత్తరాన పుట్టాడు.. మధ్యభూమిలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాన పూజించబడ్డాడు.. విశ్వానికి చెందిన ఒక గాథ'' అని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత తారక్ - త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి