
CJP Protest in Hyderabad : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో


CJP Protest in Hyderabad : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో

Khammam Victimized Girl : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన అత్యంత హృదయ విదారకరమని, సమాజం తలదించుకునేలా ఉందని బీఆర్‌ఎస్ (BRS) నాయకురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం నాడు ఆమె పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తక్షణమే ఉరిశిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతటి దారుణం జరిగినా బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు వ్యక్తులు బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. బాధితులపై ఒత్తిడి తెస్తున్న సదరు వ్యక్తులను గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. Read Also : ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్ బాధిత కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఆ చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు గాను ప్రతి నెల రూ.50,000 చొప్పున ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. దాంతో పాటు సదరు కుటుంబానికి నివసించడానికి ఒక ఇల్లు కేటాయించాలని, సమాజంలో వారికి పూర్తి స్థాయి రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. ఇటువంటి సున్నితమైన కేసులలో పోలీసులు, ప్రభుత్వం వేగంగా స్పందించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, అప్పుడే నేరగాళ్లలో భయం పుడుతుందని కవిత ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు పలికారు. ICICI బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ !! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి