ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్ల
Actor ProfilePolitician

ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం
10TV Telugu28 Jun 2026
ఖతార్ లోని కీలక కేంద్రంలో పేలుడు.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం

Qatar Gas Plant Explosion : ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్ రస్ లఫాన్ క్షేత్రంలోని బర్జాన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో 54మందికిపైగా కార్మికులకు తీవ్ర గాయాలు కాగా.. మరో 18మంది ఆచూకీ లభించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య మొన్నటి వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ దళాలు ఈ ఏడాది మార్చి నెలలో రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల కారణంగా గ్యాస్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం సర్దుమణగడంతో కొద్దిరోజుల క్రితం గ్యాస్ సరఫరా కేంద్రంలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తాజాగా.. సాంకేతికలోపం తలెత్తి ఈ భారీ అగ్నిప్రమాదం సంభించింది. అయితే, గల్లంతైన కార్మికులకోసం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, పౌర రక్షణ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి స్థానిక ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రాస్ లఫాన్ ఖతార్ లోని అత్యంత కీలకమైన ఎల్ఎన్‌జీ (LNG) ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి బర్జాన్ ప్లాంట్ రోజుకు సుమారు 1.4 బిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ను ఉత్పత్తిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దేశీయ విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు ఈ ప్లాంట్ కీలకంగా పనిచేస్తోంది. ఇది ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 80కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రస్‌లఫాన్ నగరంలో ఉంది. ఇక్కడి ప్లాంట్ నుంచి గ్యాస్