ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు
Actor ProfilePolitician

ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు
Andhra Jyothy3 Jul 2026
ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు

ఖతార్‌లో రాస్ లఫాన్ ఎల్ఎన్‌జీ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ఖతార్‌లో రాస్ లఫాన్ ఎల్ఎన్‌జీ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో 66 మంది గాయపడ్డారని కూడా ఖతార్ ఇంధన శాఖ మంత్రి ధ్రువీకరించారు. ప్లాంట్ కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించేందుకు వర్కర్లు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో ప్లాంట్ ఎగుమతి సామర్థ్యం దెబ్బతినలేదని ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. పర్యావరణానికి కూడా ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఇది ఒక ప్రమాదం మాత్రమేనని, ఘటన వెనక ఎలాంటి కుట్ర లేదా దాడి లేదని కూడా వెల్లడించింది. అయితే, పేలుడు ఎలా జరిగిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. పేలుడు ధాటికి ఎంత నష్టం జరిగిందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని ఖతార్ అధికారులు తెలిపారు. ఇటీవల అమెరికాతో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ ఈ ప్లాంట్‌పై మిసైల్ దాడి కూడా చేసింది. దాడి కారణంగా మంటలు చెలరేగడంతో భారీ నష్టం సంభవించింది. 'ఆయన చెప్పినట్లు నేను వినను..' ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నెతన్యాహు జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం!