ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్
Actor ProfilePolitician

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్

Total News1
Movie Updates0
Sources1
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్
Sakshi19 Jun 2026
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్

ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్‌ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన ఆకాశ్‌ కొటాల్వార్‌ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్‌ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-2లో దిగిన తర్వాత ఉబర్‌ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్‌ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్‌ కూడా ఉబర్‌ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన ‘ఉబర్‌ కంఫర్ట్‌’ సేవను ఎంచుకున్నానని ఆకాష్‌ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు. కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్‌ లాయల్టీ (బ్రాండ్‌పై అభిమానం) కంటే "స్విచింగ్‌ కాస్ట్‌" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్‌ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్‌ కాస్ట్‌'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్‌ సేవలు గతంలో