ఖాతాదారులు నుండి ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు? అర్హులు ఎవరు
Actor ProfilePolitician

ఖాతాదారులు నుండి ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు? అర్హులు ఎవరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖాతాదారులు నుండి ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు? అర్హులు ఎవరు
Zee Telugu6 Aug 2026
ఖాతాదారులు నుండి ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు? అర్హులు ఎవరు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO 3.0 UPI-ATM: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ 3.0ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ డిజిటల్ అప్ గ్రేడ్ ద్వారా సభ్యులు యూపీఐ, ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ నెల జూన్ ఆఖరులోగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 కింద యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఏటీఎం విత్ డ్రాయల్స్ కోసం కార్డు అవసరమా ఇలాంటి ప్రశ్నలు చాలా మంది సభ్యుల్లో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. యూపీఐ, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ వేర్వేరు విత్ డ్రాయల్ లిమిట్స్ ను ఈపీఎఫ్ఓ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రస్తుత ఈపీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలను మార్చేందుకు ఎలాంటి సూచన చేయలేదు. అందుకే వినియోగదారులు విత్ డ్రాయల్ లిమిట్స్ కు సంబంధించి ఇప్పటికే నిబంధనలను పాటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అర్హులైన కస్టమర్లు విత్ డ్రా ఉద్దేశం, అర్హత ప్రమాణాలను బట్టి యూపీఐ లేదా ఏటీఎం ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్ లో 75శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈపీఎఫ్ బ్యాలెన్స్ లో 75శాతం వరకు నేరుగా కస్టమర్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కు వెంటనే ట్రాన్స్ ఫర్ చేయవచ్చని పలు నివేదికలు ఇప్పటికే పేర్కొన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కొత్త విత్ డ్రాయల్ విధానాన్ని అప్ డేట్ చేస్తున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ టెస్టింగ్ పూర్తయ్యింది. కొన్ని రోజుల్లోనే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు