
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని


రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని

మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. మంచిర్యాల, జూన్

ఇంటర్నెట్ డెస్క్: అభిషేక్ కావాలో, తాను కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేసిన కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్ విషయంలో మాట మార్చారు. అతడు తన కొడుకులాంటి వాడని.. కొడుకు తప్పు చేస్తే క్షమించే గుణం తండ్రికి ఉంటుందని పేర్కొన్నారు. అభిషేక్‌ను క్షమిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక బెంగాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతిపక్షం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిని బెంగాల్ ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. టీఎంసీని వీడిన ఎంపీలపై కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. భాజపా వేసిన ఎత్తుగడను అర్థం చేసుకోలేక వారంతా పార్టీని వీడారని..ఇప్పుడు ఆ పార్టీ నేతల నీడలో బతకాల్సి వస్తుందని పేర్కొన్నారు. టీఎంసీ, కాంగ్రెస్‌లో విలీనమవ్వనుందని వస్తున్న వార్తలను ఖండించారు. కాగా కల్యాణ్ బెనర్జీ గురువారం మీడియాతో మాట్లాడుతూ మమతకు అల్టిమేటం జారీ చేశారు. అభిషేక్ కావాలో, తాను కావాలో తేల్చుకోవాలన్నారు. ‘‘అభిషేక్ వల్లే ఈ రోజు పార్టీ నాశనమైంది. అహంకారంతో ఆయన ప్రవర్తిస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇవ్వరు. నేను ఇప్పటికీ మమత వైపే ఉన్నాను. అయితే ఎవరు కావాలో దీదీ తేల్చుకోవాలి. అభిషేక్ వైపు ఉండాలని ఆమె నిర్ణయించుకుంటే.. నేను నా నిర్ణయం తీసుకుంటా’’ అని స్పష్టం చేశారు. కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్న సంతకాల ఫోర్జరీ కేసులో తాను అభిషేక్ న్యాయవాదిగా ఉన్నానని, కానీ తనకు తెలియకుండా ఈ వ్యాజ్యంలో మరో పిటిషన్‌ను జూనియర్ లాయర్ వేశారని అన్నారు. ఇది తనకు అవమానకరమని బెనర్జీ అన్నారు. అభిషేకే ఈ పని చేయించారని.. ఇక నుంచి ఆయన కేసులు తాను వాదించనని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు