కరీనా కపూర్ తో పృథ్వీరాజ్
Actor ProfileActor

కరీనా కపూర్ తో పృథ్వీరాజ్

Total News1
Movie Updates0
Sources1
కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema18 Jun 2026
కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు చేశాడు. ఇప్పుడు దాయరా ( Daayra) అనే సినిమాలో పోలీసుగా అలరించనున్నాడు ప్రస్తుతం మలయాళంలో హీరోగా సినిమాలు చెయ్యడం కన్నా తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ గా, ప్రత్యేక పాత్రల్లో కనిపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. మలయాళంలో హీరోగా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ లో అతను చేస్తున్న పాత్రలు ఎక్కువ ఆసక్తిని రేపుతున్నాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం “వారణాసి”లో పృథ్వీరాజ్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా హిందీ చిత్రం దాయరా(Daayra)లో కరీనా కపూర్ (Kareena Kapoor)తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో కరీనా, పృథ్వీరాజ్ ఇద్దరూ పోలీసు అధికారులుగా కనిపిస్తారు. ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మేఘనా గుల్జార్ తీస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 18న హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక రాజమౌళి ‘వారణాసి’ వచ్చే ఏడాది విడుదల అవుతుంది