కర్ణాటకలో మండలి ఎన్నికల కోలాహలం
Actor ProfilePolitician

కర్ణాటకలో మండలి ఎన్నికల కోలాహలం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కర్ణాటకలో మండలి ఎన్నికల కోలాహలం
Oneindia Telugu18 Jun 2026
కర్ణాటకలో మండలి ఎన్నికల కోలాహలం

కర్ణాటక శాసనమండలిలోని ఏడు స్థానాల భర్తీకి ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల సమరం ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విధానసభ సభ్యులు విధానసౌధలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం ఏడు స్థానాలకు గానూ కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన ఏడో స్థానం కోసమే అసలైన పోరు నడుస్తోంది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అయిదో అభ్యర్థిని, జేడీఎస్ ఒకరిని బరిలోకి దించాయి. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.శాసనమండలి ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి విజయం సాధించడానికి కనీసం 28 మంది శాసనసభ్యుల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 134 మంది, బీజేపీకి 62 మంది, జేడీఎస్‌కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్‌కు అదనంగా స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు అవసరం కాగా.. బీజేపీ అదనపు ఓట్ల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది.కాంగ్రెస్ తరఫున తిప్పన్నప్ప కమ్నూర్, పీవీ. మోహన్, బీకే హరిప్రసాద్, శివన్న బీఎస్, వినయ్ కార్తీక్ ప్రకాష్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లింగరాజ్ పాటిల్, రఘు ఆర్ పోటీ పడుతుండగా, బీజేపీ కూటమి భాగస్వామి అయిన జేడీఎస్ తరఫున గోవిందరాజు రంగంలో నిలిచారు. ఏడో స్థానం విజేతను తేల్చడంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అత్యంత కీలకం కానున్నాయి. ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను బెంగుళూరు సమీపంలోని బిడది రిసార్ట్‌కు తరలించింది. అక్కడ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు నమూనా బ్యాలెట్ పేపర్లతో