
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man Ends life at Kannada actress Krishi thapanda residence: కన్నడ నటి , బిగ్ బాస్ ఫెమ్ కృషి తపండ నివాసంలో ఒక బిజినెస్ మెన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో కన్నడ నటి కృషి తపండా ఉంటున్న ఇంట్లో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సూసైడ్ చేసుకున్న వ్యక్తిని వైశాఖ్ గా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అతను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కూడా గుర్తించారు. వెంటనే అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు వైశాఖ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. గత వారం రోజులుగా ఆమె నివాసంలో వైశాఖ్‌ను ఉంటున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. వైశాక్ కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. నెల రోజులుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గతంలో వ్యాపారవేత్త, న్యాయవాది అయిన అరవింద్ రెడ్డికి బెదిరింపు లేఖలు పంపడం తీవ్ర దుమారంగా మారింది. ఇటీవల ఫిబ్రవరిలో, రూ. 6-7 కోట్లు ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెడ్డికి కొరియర్ ద్వారా ఒక బెదిరింపు లేఖ పంపాడు. ఈ క్రమంలో అరవింద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా, ఒక మహిళకు సంబంధించిన వివాదం కారణంగా వైశాక్ ఆ లేఖను పంపాడనే


