కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
Actor ProfileActor

కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Aug 2026
కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే నటించేవాడు, డైరెక్ట్ చేసేవాడు, పాటలు రాసేవాడు, కథలు, మాటలు రాసుకునేవారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. రీమేక్ అయ్యాయి. చిన్నరాజా పేరుతో ఆయన నటించిన ఒక తమిళ చిత్రం తెలుగులో డబ్ అయింది. ఆడింది. దాన్నే మళ్ళీ ఇవివి సత్యనారాయణ “అబ్బాయి గారు” అని రీమేక్ చేసి విజయం సాధించారు. ఆయనని “స్క్రీన్ ప్లే ల్యాబ్” అని పిలిచేవారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే రాయడంలో ఆయన దిట్ట. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఆయన కథలు హిట్ అయ్యాయి. ఆయన తమిళ చిత్రాలే మాతృకగా తీసుకొని తెలుగులో రీమేక్ అయినవి ఏంటో చూద్దాం…. రాధా కళ్యాణం (1981) – చంద్రమోహన్, శరత్ బాబు, రాధిక మాతృక: అంద 7 నాట్కళ్ (Andha 7 Naatkal) మూడు ముళ్ళు (1983) – చంద్రమోహన్, రాధిక మాతృక: ముందనై ముడిచు (Mundhanai Mudichu) అబ్బయిగారు – వెంకటేష్, మీనా ఎంగ చిన్న రాసా (Enga Chinna Rasa) అదిరింది అల్లుడు – మోహన్ బాబు, రమ్యకృష్ణ మాతృక: ఇదు నమ్మ ఆలు (Idhu Namma Aalu) సుందరకాండ: వెంకటేష్, మీనా మాతృక: సుందరకాండం (Sundara Kandam) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: వెంకటేష్, సౌందర్య మాతృక: తైకులమే తైకులమే (Thaikulame Thaikulame)