కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం
Actor ProfilePolitician

కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
Andhra Jyothy28 Jun 2026
తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ

న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్ ను కలిసిన టెకీ గాయత్రి తల్లి
Andhra Jyothy28 Jun 2026
న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్ ను కలిసిన టెకీ గాయత్రి తల్లి

విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రావును గాయత్రి తల్లి సత్యవతి కలిశారు. విశాఖపట్నం, జూన్ 22: విశాఖకు చెందిన టెకీ

కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం
Andhra Jyothy27 Jun 2026
కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం

కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. కడప జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డిగారి పల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని రాజవర్ధన్ రెడ్డి (16), జయంతి రెడ్డి (18)గా గుర్తించారు. వీరు విద్యార్థులు కాగా, బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా సరదాగా స్నేహితులతో కలిసి పాపాగ్ని నదిలోని ఇసుక క్వారీ గుంత వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు లోతైన గుంతలో చిక్కుకుని మునిగిపోయారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన లోతైన నీటి గుంతలు ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ