
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్నటివరకు తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి.. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.కోస్తాంధ్రా, యానాంలో వాతావరణ సూచన (ఉత్తర & దక్షిణ కోస్తా)ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో ఈరోజు (సోమవారం) వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది.ఈరోజు: కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. అయితే, ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.వరుణుడి బీభత్సం. రాబోయే 3 గంటలు అత్యంత కీలకం!రేపు, ఎల్లుండి: మంగళ, బుధవారాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కొనసాగుతుంది.రాయలసీమ పరిధిలోనూ ఇదే పరిస్థితి!కోస్తా జిల్లాలతో పాటే రాయలసీమ ప్రాంతంలోనూ వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది.ఈరోజు: రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఒకటి లేదా రెండు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 40-50 కిమీ వేగంతో) కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు