CM Revanth Reddy Nalgonda Speech : పదేళ్ల పాటు అధికార పదవులు అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం.. స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ కామెట్లు చేశారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ విజయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే.. వాళ్లకు కడుపు మంట!పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడికి సొంత ఇల్లు కట్టించాలనే ఆలోచన చేయలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "ఈరోజు గ్రామగ్రామాన అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులకు కడుపు మండుతోంది" అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమ చేశామని, ఏడాదికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తూ పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. కేంద్రం నుంచి యూరియా సరఫరాలో సహాయ నిరాకరణ ఎదురైనా.. తాము కష్టపడి తెప్పించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకే నేడు ధాన్యపు దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గర్వంగా ప్రకటించారు.30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..!యువతకు ఉపాధి కల్పనలో తమ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. కేవలం 30 నెలల స్వల్ప వ్యవధిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు. దేశంలో ఎక్కడా లేని
Actor ProfilePolitician
కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించారు.. మళ్లీ వాళ్లనస్సలే గెలిపించరు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•10 Aug 2026
కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించారు.. మళ్లీ వాళ్లనస్సలే గెలిపించరు