కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు
Actor ProfileActor

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు
Eenadu8 Aug 2026
కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి.. కన్పర్మ్ చేసిన నటుడు

ఇంటర్నెట్ డెస్క్: సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander), ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్‌ (Kavya Maran) కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరిగింది. ఈ ప్రచారాన్ని అనిరుధ్‌ ఖండించారు. అయితే, తాజాగా వీరి వివాహం గురించి మరో వార్త బయటికొచ్చింది. అనిరుధ్‌, కావ్య మారన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు తెలిపారు.‘‘అనిరుధ్ మృదు స్వభావి. నాకు తెలిసినంతవరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి ఆర్డినరీ గర్ల్‌ కాదు. అంత పెద్ద జట్టును (SRH) నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. ఆమె తన తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాలను పుణికిపుచ్చుకుంది. అనిరుధ్, కావ్య మారన్ మంచి జంట’’ అని పేర్కొన్నారు. కావ్య.. సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ కుమార్తె. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో మైదానంలో తనదైన హావభావాలతో పాపులర్‌ అయ్యారు. కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’, ‘బీస్ట్‌’, ‘రాయన్‌’ తదితర చిత్రాలకు అనిరుధ్‌ సంగీతం అందించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా వరంగల్ వారియర్స్‌, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది