
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్‌లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్‌గా మారాలని '3ఈ' ఫిట్‌నెస్ సెంటర్‌ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్‌లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు. అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్‌లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్‌గా మారానని చెబుతున్నాడు. తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు.. ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు