
రాజమహేంద్రవరం (నగరపాలక సంస్థ): కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై గురువారం రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో వంగవీటి మోహన్ రంగా, దేవినేని నెహ్రూ మధ్య వివాదాలకు రాజశేఖర్‌రెడ్డి కులం రంగు పులిమి రాష్ట్రవ్యాప్తంగా ఆ రెండు కులాల మధ్య వైరం తీసుకొచ్చారన్నారు. తండ్రి బాటలోనే నడుస్తున్న జగన్ సైతం కులాలు, మతాల పేరిట విభజించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్న ముద్రగడ వైకాపా పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా వైకాపా రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తోందన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రెండేళ్ల కూటమి హయాంలో రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో పరిశ్రమలు పూర్తికానున్నాయని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పేద ప్రజలు సైతం అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించేందుకు ఆరాటపడుతున్నారు. తిరుపతి చేపల మార్కెట్‌లో కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు అమ్ముతున్న దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు