
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Cool Drink Death Karnataka: ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాల (సాఫ్ట్ డ్రింక్స్) వ్యసనం ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో హెచ్చరించే ఒక దిగ్భ్రాంతికర ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మితిమీరిన శీతల పానీయాల వాడకం వల్ల ఓ 19 ఏళ్ల యువకుడు కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు, అధికంగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య ముప్పుల గురించిన కథనం ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 3 నుంచి 4 బాటిళ్లు..! కర్ణాటకలోని యాద్‌గిరి జిల్లా, హునసగి తాలూకా నారాయణపూర్ గ్రామానికి చెందిన బాలు దేశాయ్ (19) అనే యువకుడు విజయపురలోని ముద్దెబిహాల్‌లో చదువుకుంటున్నాడు. అతడికి గత కొంతకాలంగా మార్కెట్లో దొరికే 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్ తాగడం వ్యసనంగా మారిందని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎంత వారించినా వినకుండా.. రోజుకు దాదాపు 3 నుంచి 4 బాటిళ్ల డ్రింక్స్ తాగేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కిడ్నీలు ఫెయిల్యూర్‌తో మృతి ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా బాలు దేశాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. తీవ్రమైన నీరసం, శరీరంలో అసౌకర్యం కలగడంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాగల్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 12న బాలు దేశాయ్ మరణించాడు. అతిగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే అతడి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని (కిడ్నీ ఫెయిల్యూర్) వైద్యులు నిర్ధారించారు. కూల్‌డ్రింక్స్ ముప్పు ఏంటి? ఈ ఘటన