
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు దేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా కోల్‌కతా బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం సంస్కరణల అమలులో ఏపీ ముందంజలో ఉంది ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలి కోల్ కతా: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలని, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కోల్ కతా లోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) ప్లీనరీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్లీనర్ సెషన్ లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులు, సంపద సృష్టికర్తలు, దేశ నిర్మాణకర్తల సమక్షంలో ఉండడం గౌరవంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఒక మాట ఉంది. ఈ రోజు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో.. రేపు భారత్ అది ఆలోచిస్తుంది. అందుకే మళ్లీ కోల్‌కతాకు వచ్చి.. మీ అందరి మధ్య ఉండడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపిస్తోంది. భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రయాణానికి కోల్‌కతానే రాజధానిగా నేను భావిస్తాను. బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం గురువారం సాయంత్రం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం నాకు లభించింది. అభివృద్ధి పట్ల వారి అంకితభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే భారతదేశం గెలుస్తుందని నేను విశ్వసిస్తాను. పోటీ ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుంది. అదే సమయంలో రాష్ట్రాలు కలిసి పనిచేసి.. తమ బలాలను పెంచుకోవాలి. తద్వారా మరింత శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించగలం. ఉద్యోగాల కల్పన విషయంలో పశ్చిమబెంగాల్