కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ
Actor ProfileActor

కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ

Total News1
Movie Updates0
Sources1
కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ-రిలీజ్ తో అల్లు అర్జున్ సెన్సేష న్
Samayam Telugu13 Jun 2026
కేరళలో పెద్ది’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసిన హ్యాపీ’.. రీ-రిలీజ్ తో అల్లు అర్జున్ సెన్సేష న్

మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం, మ‌ల‌యాళ టీవీ చానెల్స్‌లో ప్రసారమైన తన డ‌బ్బింగ్ సినిమాలతో మాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు బన్నీ. త‌న ఎన‌ర్జిటిక్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, స్టైలిష్ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తాను నటించే ప్రతీ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేస్తూ మార్కెట్ విస్తరించుకున్నారు. తాజాగా ‘హ్యాపీ’ రీ-రిలీజ్ తో అల్లు అర్జున్ మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.అల్లు అర్జున్ హీరోగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హ్యాపీ’. 2006లో వచ్చిన ఈ చిత్రం.. మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’ పేరుతో డబ్ చేయబడింది. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాని ఇటీవలే మలయాళంలో 4Kలో రీ-రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లన్నీ జనాలతో నిండిపోయాయి. షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. సినిమా హాళ్లలో అక్కడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పాటలకు డ్యాన్సులు వేస్తూ గోలగోల చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కేరళంలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ వసూళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు రూ.30 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మలయాళంలో రిలీజైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఓపెనింగ్ డే రూ.20 లక్షలు వసూలు చేయగా.. సంక్రాంతికి వచ్చిన ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే రూ.19 లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం నాటు అల్లు అర్జున్ సినిమా.. రెండు భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా చిత్రాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ కేరళంలో రూ.26.5 లక్షల గ్రాస్ రాబట్టగా.. ఇప్పుడు హ్యాపీ’ అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన రెండో రీ-రిలీజ్ మూవీగా