కార్పొరేట్ విద్యావ్యవస్థ
Actor ProfilePolitician

కార్పొరేట్ విద్యావ్యవస్థ

Total News1
Movie Updates0
Sources1
కార్పొరేట్ విద్యావ్యవస్థపై చిరంజీవి కామెంట్స్.. ప్రభుత్వాలు సహకరించాలి
10TV Telugu13 Jun 2026
కార్పొరేట్ విద్యావ్యవస్థపై చిరంజీవి కామెంట్స్.. ప్రభుత్వాలు సహకరించాలి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన కొడుకు చరణ్ పెద్ది సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ కథాంశంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఇప్పటికే పెద్ది సినిమా 370 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇన్నాళ్లు షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి తాజాగా ఈ సినిమా చూసి బుచ్చిబాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ..ఎప్పుడూ బ్లాక్ బోర్డు కాదు దాని వెనకాల గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పటి స్కూల్స్ లో అసలు గ్రౌండ్స్ లేవు. పిల్లలని ఆటల వైపు ఎంకరేజ్ చేద్దామనే మెసేజ్ తో కూడా ఈ సినిమా చేసా అని చెప్పారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు పిల్లలను మార్కులు మార్కులు అంటున్నారు. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. ఈ సినిమాలో అదే మెసేజ్ ఇచ్చారు. ఇది చూసి స్ఫూర్తి పొందాలి విద్యార్థులు. పిల్లలు, పేరెంట్స్ ఈ సినిమా చూసి స్పోర్ట్స్ ఎంత అవసరమో అవగానే రావాలి. స్పోర్ట్స్ పర్సన్స్ ని గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మంచి పాయింట్ ఉండి ఈ సినిమాలో అని అన్నారు. బుచ్చిబాబు – చిరంజీవి ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి