
Keerthy Suresh Sathyavan Savithri: చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కీర్తి సురేష్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ న్యాయవాదిగా కనిపిస్తూ ప్రత్యర్థిని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read also: Adarsha Kutumbam Movie: త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ లో భారీ మార్పులు! ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. న్యాయానికి చట్టానికి మధ్య ఉండే తేడాలను ఈ సినిమాలో చూడవచ్చు. తన భర్త కేసులో చిక్కుకున్న సావిత్రి అనే న్యాయవాది పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆమె న్యాయం కోసం పోరాడుతుంటే ఆమె సీనియర్ న్యాయవాది మాత్రం చట్టాన్ని నమ్ముతారు. వీరిద్దరి మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘర్షణే ఈ సినిమా ప్రధానాంశం. మిస్కిన్ ఇందులో కీర్తికి సీనియర్ న్యాయవాదిగా నటిస్తున్నారు. సత్యవాన్ సావిత్రి చిత్రం తర్వాత కీర్తి సురేష్ పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ రావు సరసన ఆమె నటించిన రఫ్తార్ అనే సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ప్రఖ్యాత దర్శకులతో ఆమె చర్చలు జరుపుతున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు కీర్తి సిద్ధమవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్‌లో ఈ సంవత్సరం చాలా కీలకమని చెప్పవచ్చు. CM Revanth : రేవంత్ చేతగానితనం వల్లే తెలంగాణ లో బాబు, పవన్ రాజకీయాలు – కవిత గమనిక: ఈ వెబ్ సైట్ లో