క్రెడిట్ కార్డు హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే మీ డబ్బు రిట్టర్న్.. కొత్త గైడ్ లైన్స్
Actor ProfilePolitician

క్రెడిట్ కార్డు హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే మీ డబ్బు రిట్టర్న్.. కొత్త గైడ్ లైన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్రెడిట్ కార్డు హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే మీ డబ్బు రిట్టర్న్.. కొత్త గైడ్ లైన్స్
10TV Telugu17 Jul 2026
క్రెడిట్ కార్డు హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే మీ డబ్బు రిట్టర్న్.. కొత్త గైడ్ లైన్స్

ఆర్‌బీఐ కొత్త డిజిటల్ నిబంధనలు. ఐదు రోజుల్లోగా నగదు వాపస్. రూ.500 పైగా ఉచిత ఎస్‌ఎంఎస్. Credit Card Fraud: క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. క్రెడిట్‌ కార్డు మోసాల(Credit Card Fraud)పై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా, సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్‌ లేదా ప్రొవిజనల్‌ క్రెడిట్‌ (తాత్కాలికంగా నగదు బదిలీ) రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్‌ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. TG New Housing Scheme: పేరు పెట్టండి లక్ష గెలుచుకోండి.. తెలంగాణ కొత్త హౌసింగ్ స్కీమ్.. లాస్ట్ డేట్ ఇదే ఖాతాదారులపై బాధ్యత లేని సందర్భాలు: మోసం ఎలా జరిగినా కూడా ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్‌బీఐ స్పష్టత నిచ్చింది. బ్యాంక్ లోపాలు: బ్యాంక్‌ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ‘లావాదేవీని రద్దు చేసి, పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి’. థర్డ్ పార్టీ హ్యాకింగ్: బ్యాంక్‌ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్‌ పార్టీ హ్యాకింగ్‌ వల్ల మోసం జరిగితే, ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్‌ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే, వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, బ్యాంక్‌ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఫిర్యాదు తర్వాతి లావాదేవీలు: ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ ఖాతా నుంచి మళ్లీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా.. బ్యాంకులే ఆ