క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు సాధ్యం
Actor ProfileActor

క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు సాధ్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు సాధ్యం
Sakshi13 Aug 2026
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు సాధ్యం

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్‌లో పిచాయ్‌తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్‌ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు. భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్‌లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్. ‘నేను, సుందర్‌ గూగుల్‌లో చాలా కాలం కలిసి పని చేశాం. కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్‌ నాకు తెలుసు. గూగుల్‌లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్‌లైన్‌ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్‌స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్‌ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం