క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు
Actor ProfilePolitician

క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు
Oneindia Telugu19 Jun 2026
క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల నాణ్యతను అంచనా వేసే ప్రతిష్ఠాత్మక క్వాకరెల్లీ సైమండ్స్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదలైంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు ప్రముఖ విద్యా సంస్థలు ఈ జాబితాలో స్థానం సాధించాయి. ఐఐటీ హైదరాబాద్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకోగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) స్థానం కొంత తగ్గింది.క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో ఉస్మానియాకు నో ప్లేస్ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రం ఈసారి ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఐఐటీ హైదరాబాద్ గత ఏడాది 664వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 588వ ర్యాంకుకు చేరుకుంది. పరిశోధనా రంగంలో అత్యుత్తమ పనితీరు, అధ్యాపకుల ప్రచురణలు, సైటేషన్ల సంఖ్యలో సాధించిన అభివృద్ధి ఈ మెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. సంస్థ స్కోర్ 86.80 పాయింట్లకు చేరుకోవడం విశేషం. ఇది తెలంగాణ ఇంజనీరింగ్ విద్యా రంగంలోని బలాన్ని మరోసారి నిరూపించింది.పడిపోయిన సెంట్రల్ యూనివర్సిటీ స్థానంమరోవైపు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గత రెండేళ్లుగా 801-850 ర్యాంకుల మధ్య ఉండగా, ఈసారి 851-900 పరిధికి పడిపోయింది. ఇన్‌ఛార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జె. అనురాధ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అన్ని విధాలైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గత రెండేళ్లుగా 1,201-1,400 మధ్యలో ఉండగా, ఈ ఏడాది 1,500 ర్యాంకుల జాబితాలో కూడా స్థానం దక్కలేదు.ఆ డీమ్డ్ యూనివర్సిటీలకు స్థానంవైస్ చాన్సలర్ ఆచార్య ఎం. కుమార్ ఈ అంశంపై సమీక్షించుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌లో క్యాంపస్‌లు కలిగిన డీమ్డ్ యూనివర్సిటీలైన బిట్స్-పిలానీ ర్యాంకు 668 నుంచి 575కి మెరుగుపడగా, అమిటీ యూనివర్సిటీ 901-950 మధ్య స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విద్యా సంస్థా ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోలేదు.ఐఐటీ ఢిల్లీ 118వ ర్యాంకుతో భారతీయ సంస్థల్లో అగ్రస్థానంభారతదేశం మొత్తం మీద ఈ ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్తంగా 52 విశ్వవిద్యాలయాలు జాబితాలో స్థానం సాధించాయి. ఐఐటీ