
Samsung Galaxy S26 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. 200MP కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ (Samsung Galaxy S26 Ultra 5G) ఉంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ డీల్స్, డిస్కౌంట్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. డిస్కౌంట్, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,17,964కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3500 తగ్గింపు పొందవచ్చు. దాంతో అసలు ధర రూ. 1,14,464 అవుతుంది. మరోవైపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ ద్వారా రూ. 60,300 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ పూర్తి బెనిఫిట్స్, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2026 ఫిబ్రవరిలో రూ. 1,39,999కి లాంచ్ కాగా రూ. 25,000 తక్కువ ధరకే లభిస్తోంది. Read Also : JioBharat V4 4G : పండగ చేస్కోండి.. జస్ట్ రూ. 799కే జియో 4G ఫోన్.. ఫొటోలే కాదు.. UPI పేమెంట్లు చేయొచ్చు..! ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా 5జీ ఫోన్ 3120×1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ ఫోన్