కాబోయే అమ్మకు కడుపులో వికారం
Actor ProfileCelebrity

కాబోయే అమ్మకు కడుపులో వికారం

Total News1
Movie Updates0
Sources1
కాబోయే అమ్మకు కడుపులో వికారం
Sakshi14 Jun 2026
కాబోయే అమ్మకు కడుపులో వికారం

గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్‌ సిక్‌నెస్‌’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్‌ కారణమవుతుంది. మార్నింగ్‌ సిక్‌నెస్‌తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్‌ సిక్‌నెస్‌ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్‌ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్‌ డైట్‌ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్‌ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్‌ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్‌ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్‌ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్‌ సిక్‌నెస్‌ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి