కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్
Actor ProfilePolitician

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్

Total News1
Movie Updates0
Sources1
కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే
Zee Telugu16 Jun 2026
కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఈ నెల 21వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ జరగాల్సి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీ వ్యవహారాలు, లీకైన ప్రశ్నపత్రాల సర్క్యులేషన్, వివిధ రకాల గ్రూపుల ద్వారా అక్రమ సమాచారం చేరవేయడంలో టెలిగ్రామ్ యాప్ పెద్ద ఎత్తున దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పరీక్షకు ఒక రోజు ముందు నుంచి.. పరీక్ష ముగిసిన మరుసటి రోజు వరకు ఈ యాప్‌ను పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా టెలిగ్రామ్ యాప్‌లో పెద్ద పెద్ద ఫైళ్లను, ప్రశ్నపత్రాలను, స్టడీ మెటీరియల్స్‌ను.. గ్రూపులు, ఛానళ్ల ద్వారా ఒకేసారి వేలాది మందికి షేర్ చేయడానికి వీలుంటుంది. పైగా ఇందులో పంపించే వారి వివరాలు అంత త్వరగా బయటకు తెలియవు. ఈ ఫీచర్లను కొందరు కేటుగాళ్లు తప్పుడు పనులకు, పరీక్ష పేపర్లు లీక్ చేయడానికి వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. రీ-ఎగ్జామ్ సమయంలో ఎలాంటి లీకేజీ పుకార్లు రాకుండా అడ్డుకోవడానికి, అక్రమాలకు తావులేకుండా పరీక్షను ప్రశాంతంగా జరగడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి