
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Small Savings Schemes: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చిన్న పొదుపు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిఏడాది ఈ పథకాల వడ్డీరేట్లను మార్చుతూ వస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఏడాదికి గాను చిన్న పొదుపులపై వడ్డీ రేట్లను కేంద్రం తాజాగా ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, వంటి పలు చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. జులై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండవ త్రైమాసికానికిగాను ఈ రేట్లు యథాతథంగా ఉంచారు. ఈ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం ఇది వరుసగా 9వ ఏడాది అని చెప్పాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి జూలై 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు విధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి నోటిఫై చేసిన విధంగానే కొనసాగుతాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ కొనసాగుతుంది. అయితే మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.1 శాతంగానే ఉంచారు. ప్రజాదరణ పొందిన పొదుపు పథకం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా యథాతథంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌పై రేటు 4 శాతంగా యథాతథంగా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో చేసిన పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి